- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: గౌరవం చిన్నారుల గౌన్లుగా మారింది.. సన్మానాలకు వచ్చిన శాలువాలతో గౌన్‌లు కుట్టించిన ఏఎస్పీ
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి (Seshadrini Reddy) వినూత్న కార్యక్రమం చేపట్టారు. వివిధ సన్మానాలు, సత్కారాల సందర్భంగా అందిన శాలువాలతో చిన్నారుల కోసం గౌన్లు కుట్టించి పంపిణీ చేశారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని బేడ, బుడగ, జంగాల కాలనీల చిన్నారులకు టౌన్ సీఐ వీరప్రసాద్‌తో కలిసి ఈ గౌన్లను ఏఎస్పీ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ.. తనకు అందిన గౌరవాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సన్మానాల సందర్భంగా ఇచ్చే శాలువాలు, కండువాలు వృథా కాకుండా గౌన్లు కుట్టించి చిన్నారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు ఏఎస్పీ చర్యను ప్రశంసిస్తూ, ఇతరులు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొందాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. శాలువాలు గౌరవంగా తీసుకోని ప్రేమగా చిన్నారులకు ఇచ్చిందని నెట్టింట ప్రశంసలు కురిపించారు. గౌరవం చిన్నారుల గౌన్లుగా మారాయని పలువురు కామెంట్స్ చేశారు. వీడియో ఇదే..






