- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసిఫ్ గొప్ప సాహసమే చేశాడు.. డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసలు
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్‌ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్ (Asif)కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్‌ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్ (Asif)కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాంపల్లి ఫతే మైదాన్‌లోని గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడిని ఇవాళ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) పరామర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి పరవాలేదని అన్నారు. ఒక బోన్ తప్ప మిగతా ఏమి లేని పరిస్థితుల్లో అతడు ఆస్పత్రికి వచ్చాడని పేర్కొన్నారు. వైద్యుంలు సర్జరీ చేసి మళ్లీ చెయ్యిని ఒరిజినల్ షేప్‌నకు తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం అతడి హెల్త్ కండీషన్ నిలకడగా ఉందని అన్నారు.
కాగా, అసిఫ్‌కు అయ్యే చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. గ్యాలంటరీ అవార్డు కోసం అసిఫ్ పేరును గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపుతామని వెల్లడించారు. అసిఫ్ చాలా గొప్ప సాహసం చేశాడని.. డేంజరస్ క్రిమినల్ చేతిలో కత్తి ఉన్నప్పటికీ ధైర్యంగా అతనిని ఒడిసి పట్టుకోవడం గ్రేట్ అని కొనియాడారు. అసిఫ్ వెల్డింగ్ పనిచేసుకుంటూ జీవించేవాడని.. అతడి ధైర్యాన్ని తాను ప్రశంసిస్తున్నామని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫునుంచి మేము చేయవలసిన సాయం చేస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి ఆసిఫ్ డిశ్చార్జ్ అవుతాడని, కోలుకోవడానికి మాత్రం రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.






