- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
HYD: బోనాల పండుగ తేదీలు ఖరారు

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో జూన్ 22 నుండి ఆషాడ బోనాలు పండుగ మొదలుకానుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనంతో నెలరోజుల పాటు బోనాల జాతర కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.
జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం కానుండగా.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆ తెల్లవారు (10వ తేదీన) రంగం ఉంటుంది. ఇక 16 న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.