- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే పాక్ మూర్ఖత్వం ప్రదర్శించింది: ఓవైసీ
భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం మూర్ఖత్వం ప్రదర్శించిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం మూర్ఖత్వం ప్రదర్శించిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. మే9, మే 10న పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసి వారికి బుద్ధి చెప్పిందన్నారు. భారత్ అశాంతిని కోరుకోవడం లేదని కానీ పాకిస్థాన్ ఇక్కడ అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. దేశంలోని హిందువు ముస్లింల మధ్య ద్వేషాన్ని పెంచడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అన్నారు.
ఉగ్రవాదులు అక్కడ నుండే వస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్‌ను తిరిగి గ్రే లిస్టులోకి తీసుకురావాలని చెబుతున్నామని అన్నారు. 2026-27 సంత్సరంలో బహ్రెయిన్ భద్రతా మండలిలో సభ్యురాలు కానుందని కాబట్టి ఆ కోణం నుండి చూసినా పాకిస్థాన్ గురించి ఈ దేశ ప్రభుత్వానికి వివరించడం మంచిదే అని అన్నారు. అంతే కాకుండా ఈ రోజు సమావేశంలో భారత్ తరఫున వాదనలు వినిపించామని చెప్పారు. పాకిస్థాన్ నుండి సాయం పొందిన ఉగ్రవాదులు ఇండియాలో దాడులు చేస్తున్నారని అన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వారికి చెప్పామన్నారు. దాడులకు సంబంధించి పూర్తి డేటాను ఇచ్చామన్నారు. ముంబై పేలుళ్లు, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ముందు ఆత్మాహుతి దాడి, పుల్వామా, పఠాన్‌కోట్ దాడి గురించి వివరించామన్నారు.






