పాకిస్థాన్ నుండే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు: ఓవైసీ

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ నుండే ఉగ్రవాదులు పుట్టుకువస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రకార్యకలాపాలను బహ్రెయిన్‌లో భారత అఖిలపక్ష ఎంపీలు ఎండగట్టారు.

పాకిస్థాన్ నుండే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు: ఓవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ నుండే ఉగ్రవాదులు పుట్టుకువస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రకార్యకలాపాలను బహ్రెయిన్‌లో భారత అఖిలపక్ష ఎంపీలు ఎండగట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్ల నుండి పాకిస్థాన్ కారణంగా చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అక్కడి నుండే ఉగ్రవాదులు పుట్టుకువస్తున్నారని అన్నారు.

టెర్రరిస్ట్ గ్రూపులకు పాకిస్థాన్ ఫండింగ్ చేయడం సపోర్ట్ చేయడం ఆపేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ త‌న భూమిలో టెర్ర‌రిస్ట్ క్యాంపుల‌ను నిర్వ‌హిస్తోంద‌ని అన్నారు. వాళ్లు భార‌త్ లోకి వ‌చ్చి దాడులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యాన్ని వాళ్ల కంటే ముందు నాలుగు దేశాలు తిరిగి చెబుతామ‌ని అన్నారు. ఇక ప్ర‌స్తుతం అఖిల‌పక్ష ఎంపీల బృందం బ‌హ్రెయిన్‌లో ఉండగా తరవాత కువైట్, సౌదీ అరేబియా, అల్జేరియాలోనూ పర్యటించనున్నారు.

Next Story