- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు బీహార్ ఓటర్లలో విదేశీయులు కనిపిస్తారు కానీ పహల్గామ్ ఘటనలో హంతకులు దొరకరు: ఓవైసీ
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నారని కేంద్రం ఎన్నికల సంఘం ఎలా గుర్తించగలిగిందో

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నారని కేంద్రం ఎన్నికల సంఘం ఎలా గుర్తించగలిగిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ మోడీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులను పట్టుకునేవరకు ఆపరేషన్ సిందూర్ ఆపకూడదని వ్యాఖ్యానించారు. ఆ ఉగ్రవాదులను గుర్తించే వరకు ప్రభుత్వానికి కఠినమైన ప్రశ్నలు వేస్తూనే ఉంటానని హెచ్చరించారు. ఉగ్రవాదులు హిందూ సోదరులను చంపుతుంటే మీ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్ర పోతుందా అని మండిపడ్డారు. ఘటన జరిగి నెలల తరవాత జమ్మూకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా తప్పును అంగీకరిస్తున్నారని, భద్రతా వైఫల్యం వల్లనే జరిగిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని అన్నారు.






