- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమజ్జనం సమయాన్ని తగ్గించిన కృత్రిమ చెరువులు
హైదరాబాద్‌లోని మరియు చుట్టు పక్కల నుండి చాలా వినాయక విగ్రహాలను ప్రతిఏడాది తీసుకువచ్చి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈసారి కృత్రిమ చెరువుల వద్దకు సైతం చాలా మంది ప్రజలు వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని మరియు చుట్టు పక్కల నుండి చాలా వినాయక విగ్రహాలను ప్రతిఏడాది తీసుకువచ్చి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈసారి కృత్రిమ చెరువుల వద్దకు సైతం చాలా మంది ప్రజలు వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిజమజ్జనం చేయాలి అంటే గంటలు గంటలు కూడా వేచి ఉండాల్సింది. 40 క్రేన్లు ఉన్నప్పటికీ మనకు అవకాశం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అయితే భారీ వినాయక విగ్రహాలను తీసుకువచ్చినవారికి తప్పదు కానీ కొందరు కుటుంబ సభ్యులు చిన్న విగ్రహాలను పెట్టుకుంటారు.
అలాంటి వారికి గంటలు గంటలు వేచి చూడాలంటే ఇబ్బందే. ఈసారి అలాంటి వాళ్లు చాలా మంది విగ్రహాలను కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం చేశారు. నెక్లెస్ రోడ్ లోని ఓ కృత్రిమ చెరువు వద్దకు కూడా చాలా మంది భక్తులు వచ్చి నిమజ్జనం చేశారు. అక్కడ రెండు క్రేన్లు, ఒక జేసీబీలను నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం సహాయకార్యక్రమాల కోసం చెరువు దగ్గర ఉన్నారు. ఇక ఈ చెరువులో దాదాపు 100 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇలా కృత్రిమ చెరువులను ఏర్పాటు చేయడంతో నిమజ్జనాల సమయం తగ్గడంతో పాటు హుస్సేన్ సాగర్ వద్ద సైతం కొంత రద్దీని తగ్గించగలిగారు.






