- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్ నగర్ లో కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

మహబూబ్ నగర్ లో కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్.
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
జిల్లా జైలుకు తరలింపు
దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఉపాధ్యాయుడు తన వృత్తిని మరిచి పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. నీ చదువుకు అయ్యే ఖర్చు అంతా నేనే చూస్కుంటా అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ విద్యార్థినిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. కొన్ని రోజుల నుంచి వేదింపులు ఎక్కువ కావడంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో శనివారం జిల్లా జైలుకు తరలించారు.






