తెలంగాణ డీజీపీ నియామకంపై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. తాజాగా దానిపై వాదనలు ముగిశాయి.

తెలంగాణ డీజీపీ నియామకంపై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. తాజాగా దానిపై వాదనలు ముగిశాయి. డీజీపీ జితేందర్ స్థానంలో గతేడాది ప్రభుత్వం శివధర్ రెడ్డిని నియమించింది. ఈ నియామకం సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రెండు వారాల్లోగా ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతేడాది డిసెంబర్ 24న ఆదేశించింది. తాజాగా దీనిపై వాదనలు పూర్తవ్వగా.. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

మరోవైపు తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి రాష్ట్రప్రభుత్వం UPSCకి ప్రపోజల్స్ పంపింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా, షికా గోయల్ పేర్లను జాబితాలో ఉంచింది. అయితే సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను UPSC రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపింది. లిస్టును ఆలస్యంగా పంపడంతో.. సుప్రీంకోర్టు అనుమతి కావాలని సమాధానమిచ్చింది. 9 నెలల క్రితం ఒకసారి, గత నెల 31న రెండోసారి డీజీపీల ప్యానెల్ జాబితా UPSCకి పంపితే.. క్లారిఫికేషన్ పేరుతో ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో రేపు తెలంగాణ హైకోర్టు ప్రస్తుత డీజీపీ నియామకంపై ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Next Story