ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

by Kema Shiva Kumar |

మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చేతిలోని మైక్‌ లాక్కొని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుపడ్డారనే ఆరోపణల మేరకు 2021లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) చేతిలోని మైక్‌ లాక్కొని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుపడ్డారనే ఆరోపణల మేరకు 2021లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఫిబ్రవరి 4న హైకోర్టులో రాజగోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ఇవాళ మరోసారి పూర్తి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

కాగా, మునుగోడు (Munugodu) నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌ (Choutuppal) మండలం లక్కారం గ్రామంలో 2021 జూలై 26న అప్పటి ప్రభుత్వం నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. అప్పటి మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రొటోకాల్‌ పాటించకుండా.. ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాజగోపాల్‌రెడ్డి మంత్రి చేతిలోంచి మైకు లాక్కున్నారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుపడ్డారంటూ మంత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా రాజగోపాల్ రెడ్డిపై చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Next Story