TG High Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో వాదనలు పూర్తి

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన కేసుపై డివిజన్ బెంచ్ ముందు వాదనలు ముగిసాయి.

TG High Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో వాదనలు పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన కేసుపై డివిజన్ బెంచ్ ముందు వాదనలు ముగిసాయి. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరుఫు న్యాయవాది తన వాదనలను కొనసాగించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా తన వాదనలను వినిపించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించిన సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story