- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ నడుపుతున్నరా.. సర్కస్ నడుపుతున్నరా: మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
యాకుత్‌పుర పరిధి రెయిన్ బజార్ డివిజన్, మౌలాకా ఛిల్లా బస్తీలో తెరిచి ఉంచిన గుంతలో ఓ చిన్నారి పడిపోయిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది

దిశ, వెబ్‌డెస్క్: యాకుత్‌పుర పరిధి రెయిన్ బజార్ డివిజన్, మౌలాకా ఛిల్లా బస్తీలో తెరిచి ఉంచిన గుంతలో ఓ చిన్నారి పడిపోయిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. తప్పు మాదంటే మాది కాదంటూ HYDRAA, GHMC, జలమండలి శాఖలు కీచులాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారి మ్యాన్‌హోల్‌లో పడిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. సర్కార్ నడుపుతున్నరా.. లేక సర్కస్ నడుపుతున్నరా అని మండిపడ్డారు.
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని ఫైర్ అయ్యారు. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయని చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదని జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.






