రాజీనామాకు సిద్ధమా?.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ చాలెంజ్

by Prasad Jukanti |

రేవంత్ రెడ్డి కేరళం ప్రచారంలో అబద్ధాలు చెబుతున్నారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

రాజీనామాకు  సిద్ధమా?.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని ఒకవేళ అమలు కాకపోతే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజీనామా చేస్తారా? అని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. కేరళం ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడున్నారుని ఇలాంటి అబద్దాల వల్లే గతంలో బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇవాళ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణలోని ఏ గ్రామానికైనా కేరళం మీడియాను తీసుకెళ్దా మని నా సవాల్‍ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు.

వత్తాసు పలకడం సిగ్గు చేటు

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్‍గా బీజేపీ అభ్యర్థిని తక్షణమే ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉన్న ఖానాపూర్ చైర్మన్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. నిబంధనలను ఉల్లాంఘిస్తున్న ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story