- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరాకు ఊరెళ్తున్నారా? తెలంగాణ పోలీసులు చెప్పిన 12 కీలక టిప్స్ పాటించండి!
TG Police: దసరా పండుగ సందర్భంగా చాలా మంది పట్టణాల నుంచి తమ సొంత ఊర్లకు పయనం అవుతుంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Dussehra) దసరా పండుగ సందర్భంగా చాలా మంది పట్టణాల నుంచి తమ సొంత ఊర్లకు పయనం అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు (Telangana Police) ఎక్స్ వేదికగా @TelanganaCOPs సోమవారం 12 రకాల కీలక టిప్స్ తెలియజేశారు. దసరాకు ఊరెళ్తున్నారా? భద్రం అంటూ హెచ్చరించారు. ఎక్కువ రోజులు ఊరెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారమివ్వండని తెలిపారు. ఇంటి తాళాలు పూలకుండీలు, షు రాక్స్, డోర్ మ్యాట్స్ కింద పెట్టొద్దని వెల్లడించారు. వాహనాలు ఇంటి ఆవరణలో పార్క్ చేయాలని, వాహనాల డిక్కీల్లో విలువైన వస్తువులను పెట్టకూడదని సూచించారు. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలని తెలిపారు. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాంకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలను ఆన్‌లైన్ ద్వారా తరచూ పరిశీలించండని వెల్లడించారు. డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టాలన్నారు. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని సూచించారు. కొత్త వ్యక్తుల కదలికలను గుర్తిస్తే తక్షణమే 100 డయల్ చేయాలని, పోలీసులతో సమన్వయం ద్వారా చోరీల నియంత్రణ సులభం అని కీలక సూచనలు చేశారు. కాగా, తెలంగాణలో విద్యా సంస్థలకు ఆదివారం నుంచి ఆక్టోబరు 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.






