అసలు మీకు సిగ్గు ఉందా..? అనిరుధ్ రెడ్డికి జనసేన నేత సాగర్ కౌంటర్

by Kema Shiva Kumar |

తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

అసలు మీకు సిగ్గు ఉందా..? అనిరుధ్ రెడ్డికి జనసేన నేత సాగర్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy), జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుధ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్‌కే సాగర్ (RK Sagar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న మీకు, తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది.. అసలు మీకు సిగ్గుందా? అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ మట్టిలో పుట్టి, ఇక్కడి ప్రజల కోసం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు మతిస్థిమితం ఉండాలని హితవు పలికారు.

నోరు అదుపులో పెట్టుకోకపోతే బుద్ధి చెబుతాం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వం, రాజకీయ పోరాటం గురించి మాట్లాడే స్థాయి అనిరుధ్ రెడ్డికి లేదని సాగర్ స్పష్టం చేశారు. అసలు అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో నియోజకవర్గ ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. ప్రజలకు కష్టమొస్తే ఆదుకునే గుణం పవన్ కళ్యాణ్‌ది అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుధ్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో ఒక్క పేదవాడికైనా సాయం చేశారా అని సాగర్ నిలదీశారు. అనిరుధ్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జనసైనికులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడటం చేతకాని వారు ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని సాగర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Next Story