- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులకు దృష్టి లోపం.. భారీ ఎన్‌కౌంటర్లకు కారణం అదేనా..?
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో(Forests of Chhattisgarh) ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు (Encounters)జరుగుతున్నాయి.

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ అడవుల్లో(Forests of Chhattisgarh) ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు (Encounters)జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు (Maoist Encounters)హతం అయ్యారు. వీరిలో అగ్రనాయకులు సైతం ఉన్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడానికి మావోయిస్టులకు దృష్టి లోపమే(Visual impairment) కారణమని స్పష్టంగా తెలుస్తోంది. దళాల్లోని చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్న కారణంగానే వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చుతూ మావోయిస్టుల డంప్ (Maoists Dump ) బయటపడింది. దాంట్లో కంటి పరీక్షలకు సంబంధించిన ఆధునిక పరికరాలు బయటపడటం భద్రతా బలగాలను షాక్‌కు గురి చేసింది.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)సుక్మా జిల్లా (Sukma District), చింతలనార్ పోలీస్ స్టేషన్ (CHINTALANOR POLICE STATION) పరిధిలోని అడవులలో భద్రతా బలగాలు తాజాగా భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో కంటి పరీక్షలు చేసే ఐఓఎల్ మాస్టర్ ఆప్టో మీటర్(IOL Master Optometer), లెన్స్ కిట్(Lens kit), స్టెర్త్ (Sterth) లభ్యం కావడంతో భద్రతా బలగాలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీని ద్వారానే మావోయిస్టులు కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారని స్పష్టం అయింది. చురుకైన చూపు లేనందునే భద్రతా బలగాల రాకను గుర్తించలేకపోతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే దళాలకు కంటి పరీక్షలు చేసేందుకు ఆధునిక పరికరాలను అడవుల్లోకి తెప్పించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులు తమ వద్దకే పరికరాలు తెప్పించుకున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ ఆధునిక సామగ్రిని ఎక్కడి నుంచి తెప్పించారు? మావోయిస్టులకు కంటి పరీక్షలు ఎవరు చేస్తున్నారు? అనే దానిపై భద్రతా అధికారులు ఫోకస్ చేశారు.






