V.H : కేసులు ప్రతిపక్ష నేతలకే పరిమితమా ? : వీహెచ్

by Y. Venkata Narasimha Reddy |

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Government) అధికార దుర్వినియోగం..రాజకీయ కక్ష సాధింపులలో ప్రతిపక్ష పార్టీల నేతల(Opposition Parties Leaders)పై కేసులు పెడుతూ...అధికార పార్టీ నేతలపై తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V. Hanumantha Rao) నిలదీశారు.

V.H : కేసులు ప్రతిపక్ష నేతలకే పరిమితమా ? : వీహెచ్
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Government) అధికార దుర్వినియోగం..రాజకీయ కక్ష సాధింపులలో ప్రతిపక్ష పార్టీల నేతల(Opposition Parties Leaders)పై కేసులు పెడుతూ...అధికార పార్టీ నేతలపై తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(V. Hanumantha Rao) నిలదీశారు. దేశ రక్షణకు సంబంధించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని 2022 డిసెంబర్ 16న కేసు పెట్టారని, మార్చి 24న లక్నో కోర్టుకు రావాలని రాహుల్ గాంధీకి సమన్లు పంపారని..అదే నేను స్వయంగా రాజ్యాంగాన్ని అమిత్ షా అవమనించారని, మోహన్ భగవత్ స్వతంత్ర్యాన్ని అవమానించారని ఫిర్యాదు చేస్తే వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షా, మోహన్ భగవత్ లకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయ వ్యవస్థ అందరికి సమానమే కదా? అని గుర్తు చేశారు. దామోదరం సంజీవయ్య పుట్టిన రోజు ఫిబ్రవరి 14న ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయన సమాధి దగ్గరకు రావాలని వీహెచ్ కోరారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఆయన స్మృతివనం కట్టిస్తామని 2కోట్లు కేటాయించారని..దానిపై ఇప్పటి వరకు అతిగతి లేదన్నారు. అంబేద్కర్ తర్వాత ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి సంజీవయ్యకు స్మృతి వనం కట్టించాలని, సంజీవయ్య ట్రస్టీ చైర్మన్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ లను అభ్యర్థిస్తున్నామని, అలాగే కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరుతున్నామని వీహెచ్ తెలిపారు.

Next Story