YS Jagan : మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-10 05:20:52.0  )
YS Jagan : మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బతిన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తునే ఇంకోవైపు పార్టీ బలోపేతానికి..పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తన నివాసం తాడేపల్లి ప్యాలెస్(Tadepalli Palace) లో వాస్తు మార్పుల(Architectural changes)పై కూడా దృష్టి సారించారు.

రాజకీయంగా, కుటుంబ పరంగానూ చీకాకులు, సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమని భావిస్తున్న జగన్ తన నివాసంలో వాస్తు దోషాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు పనులు చేపట్టిన జగన్..తాజాగా ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయిస్తున్నారు. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదన్న వాస్తు పండితుల సూచనల మేరకే జగన్ ఇంటి వాస్తు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తన నివాసంలో చేపట్టిన తాజా వాస్తు మార్పుల వ్యవహారంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed