By Poll: బై పోల్‌కు గెట్ రెడీ.. జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2025-08-25 13:20:38  IST  )

తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ పెరుగుతోంది.

By Poll: బై పోల్‌కు గెట్ రెడీ.. జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం
X

దిశ, సిటీ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మరో ఉప ఎన్నిక జరుగనుంది. ఇప్పుడు రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్ (Jubilee Hills By Pole) హీట్ పెరుగుతోంది. సిట్టింగ్ సీటు కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఆ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుండగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తోంది. ఎన్నికల సంఘం ఈ స్థానానికి బై పోల్ సమర్థవంతంగా నిర్వహించేందుకు తాజాగా నోడల్ అధికారులను నియమించింది. ఈసీ ఆదేశాలతో నోడల్ అధికారులను (Nodal Officer) నియమిస్తూ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ ఆర్.వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ విడుదల చేయగా ఇవాళ రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ భేటీ అయ్యారు.

నోడల్ అధికారులు వీళ్లే:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించారు. అలాగే ఈవీఎం, వివిప్యాట్ నిర్వహణ కోసం కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సి.టి.ఓ శ్రీనివాస్, ట్రైనింగ్ అధికారిగా ఎల్‌.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, మెటీరియల్ మేనేజ్మెంట్ బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్‌కు అప్పగించారు. ఎంసీసీ నోడల్అధికారిగా అదనపు ఎస్పీ (విజిలెన్స్)ఎం. సుదర్శన్, లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ బాధ్యతలు డీఎస్పీ నరసింహా రెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ (ఫినాన్స్) జీహెచ్ఎంసీ బి గీతా రాధికకు అప్పగించారు. ఎన్నికల పరిశీలకులుగా అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, మీడియా కమ్యూనికేషన్, ఎంసీఎంసీ అధికారిగా సీపీఆర్‌ఓ సెక్షన్ పీఆర్‌ఓ ఎం.దశరథ్ ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ, ఐటి, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఐటి జాయింట్ కమిషనర్ సి.రాధా, హెల్ప్‌లైన్, కంప్లైంట్ రీడ్రెస్సల్ అధికారిగా ఐటి ఏఈ కార్తీక్ కిరణ్, వెబ్‌కాస్టింగ్ అధికారిగా ఐటి ఏఈ తిరుమల కుమార్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

రేషనలైజేషన్‌పై అభ్యంతరాలు తెలుపండి:

మరోవైపు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలు ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీలను కోరారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ పై జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న 320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. గతంలో 132 లొకేషన్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 139 లొకేషన్లలో ప్రతిపాదించామని వివరించారు. అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Next Story