తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు.. లేట్ ఫీజుతో జూన్ 30 వరకు ఛాన్స్

by Ramesh Naini |

2025 విద్యా సంవత్సరానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు.. లేట్ ఫీజుతో జూన్ 30 వరకు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Suravaram Pratap Reddy Telugu University) నిర్వహించే రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం (Telugu University) విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ (Registrar) ఒక ప్రకటన విడుదల చేశారు. శిల్పం-చిత్రలేఖనం, డిజైన్స్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం (కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా లాంటి తదితర అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూ­జీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగి ఆసక్తిగల విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం www.teluguuniversity.ac.in & www.pstucet.org వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. దరఖాస్తులను జూన్‌ 26 వ తేదీలోగా, ఆలస్య రుసుము (లేట్ ఫీజు)తో జూన్‌ 30 లోగా విశ్వవిద్యాలయానికి సమర్పించాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో సూచించారు.

Next Story