- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Ration Cards: మీసేవ దరఖాస్తు రసీదు ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదు: పౌరసరఫరాల శాఖ
మీసేవ దరఖాస్తు రసీదులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మీసేవ దరఖాస్తు రసీదు విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) స్పందించింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మీసేవలో దరఖాస్తు చేసిన రసీదును భద్రపరుచుకోవాలని సూచించింది. రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, మీసేవ (Me Seva) కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని తెలిపింది. రేషన్ కార్డు కోసం అప్లికేషన్ల (Ration Cards Applications) కు నిర్దేశిత గడువు ఏమీ లేదని దరఖాస్తు దారులు తొందర పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన రశీదును పౌరసరఫరాల శాఖ కార్యాలయం లేదా తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని మీ సేవ నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో అప్లికేషన్ రశీదులను పట్టుకుని సివిల్ సప్లయ్ కార్యాలయాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేశాక మళ్లీ ఫిజికల్‌గా రశీదులు ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు.






