పీజీ మెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు : ఎన్ఎంసీ

by Ramesh Naini |   (  Updated:2026-03-26 16:07:32  IST  )

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను ప్రారంభించడానికి, సీట్లను పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ మెడికల్ కమిషన్ పొడిగించింది.

పీజీ మెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు : ఎన్ఎంసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ కోర్సులను ప్రారంభించడానికి, సీట్లను పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పొడిగించింది. ఈ మేరకు మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఏఆర్బీ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రాడ్ స్పెషాలిటీ (బీఎస్), సూపర్ స్పెషాలిటీ (ఎస్ఎస్) కోర్సులకు సంబంధించి 2026-2027 విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని ఏప్రిల్ 20, 2026 వరకు పొడిగించారు. కొత్త పీజీ మెడికల్ కోర్సులను ప్రారంభించాలనుకునే కళాశాలలు, కొత్తగా స్టాండలోన్ పీజీ వైద్య సంస్థలను ఏర్పాటు చేసే విద్యాసంస్థలు, ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలనుకునే విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుంది. అర్హత ఉన్న కళాశాలలు నిర్ణీత గడువులోగా ఎన్‌ఎమ్‌సీ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లంగర్ తెలిపారు.

Next Story