మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు‌పెంపు

by Vinod kumar |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలలో(మోడల్ స్కూల్) ప్రవేశాలకు దరఖాస్తుల గుడువును ఫిబ్రవరి 22వ తేదీ వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకురాలు ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు‌పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలలో(మోడల్ స్కూల్) ప్రవేశాలకు దరఖాస్తుల గుడువును ఫిబ్రవరి 22వ తేదీ వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకురాలు ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంతకు ముందు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 15 తో ముగియనుంది. ఇప్పటివరకు 43, 498 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఓసీ అభ్యర్థులకు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 125 రూపాయాలతో దరఖాస్తు రుసుము చెల్లించాలని, అప్లికేషన్ వివరాల కోరకు http://telanganams.cgg.gov.in ను సంప్రదించాలని సూచించారు.

Next Story