- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIMS: నిమ్స్‌లో ఎంహెచ్‌ఎం కోర్సులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుకు దరఖాస్తు తేదీ పొడిగిస్తునట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో 2025 సంవత్సరానికి గాను మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (MHM) కోర్సుకు దరఖాస్తు తేదీ పొడిగిస్తునట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల కోర్సు తర్వాత 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 20 సీట్లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ కలిగిన అభ్యర్థులు జులై 10 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకొని, ప్రతులను జులై 14 లోపు ఆసుపత్రిలో ఇవ్వాలని సూచించారు.
ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 5 వేలు (ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్), రూ. 4 వేలు (ఎస్సీ/ఎస్టీ), ప్రవేశ రుసుము రూ. 5 వేలు, సెక్యూరిటీ డిపాజిట్ రూ.వేయి (రిఫండబుల్), ట్యూషన్ ఫీజు రూ. 26, 250 (ప్రతి సెమిస్టర్). మరిన్ని వివరాల కొసం నిమ్స్ వెబ్‌సైట్ nims.edu.in సందర్శించాలని లేదా ఫోన్ నెంబర్ 040 - 23489189 సంప్రదించాలని సూచించారు.






