Civil Supplies : ఏపీ, తెలంగాణ సివిల్ సప్లయ్ మంత్రుల సమావేశం

by Muthe.Rajitha |

ఏపీ(AP), తెలంగాణ(Telangana) సివిల్ సప్లైస్ మంత్రులు(Civil Supplies Ministers) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) నేడు హైదరాబాద్‌(Hyderabad)లోని తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు.

Civil Supplies : ఏపీ, తెలంగాణ సివిల్ సప్లయ్ మంత్రుల సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP), తెలంగాణ(Telangana) సివిల్ సప్లైస్ మంత్రులు(Civil Supplies Ministers) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) నేడు హైదరాబాద్‌(Hyderabad)లోని తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య సివిల్ సప్లైస్ సంబంధిత సమస్యలను చర్చించినట్టు తెలుస్తోంది. బియ్యం సేకరణ, పంపిణీ, రేషన్ సరఫరాలలో ఇరు రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలపై కీలక చర్చ జరిగింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్(APSCSC) ద్వారా బియ్యం సేకరణ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)కి సరఫరాలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పని చేశాయని పేర్కొన్నారు. ఏపీలో రేషన్ కార్డ్‌దారులకు నెలకు 5 కిలోల ఉచిత బియ్యం, చక్కెర, నూనె, పప్పు సరఫరా ఏర్పాట్లను వివరించిన నాదెండ్ల మనోహర్.. సరిహద్దు ప్రాంతాల్లో రేషన్ అక్రమ రవాణా వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతున్నా, ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(MSP) అమలులో సమస్యలు ఉన్నాయని, అక్రమ రవాణాను నియంత్రించడానికి ఉమ్మడి చర్యలు అవసరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాలు FCIకి బియ్యం సరఫరాలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని, రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచాలని, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, MSP సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Next Story