- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: బనకచర్ల విషయంలో ఏపీ విభజన చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి-బనకచర్ల (Banakacharla) లింక్ ప్రాజెక్టు పై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ విభజన చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. బనకచర్లపై ఏపీ కేంద్రానికి ప్రీ ఫీజబులిటీ రిపోర్టు ఇచ్చింది. ఏపీ రిపోర్టుపై స్పందించాలని కేంద్రం మమ్మల్ని అడింగింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ప్రాథమికంగా అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశాం. పూర్తి స్థాయి నివేదికను కేంద్రానికి మేం సమర్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేను రేపు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు.
కేంద్ర మంత్రులు దూరం..ఈ పీపీటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా బీఆర్ఎస్ నుంచి ఎంపీ రవిచంద్ర, బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షట్కర్, రఘరాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, చాలమ కిరణ్ కుమార్ రెడ్డి, బలరామ్ నాయక్, మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వివరాలను సభ్యులకు ఉత్తమ్ వివరించారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రీ ఫీజబిలిటీ నివేదిక సమర్పించిందని చెప్పారు. బనకచర్లపై ఎంపీల అభిప్రాయాలు చాలా కీలకం అన్నారు. కాగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మంత్రి ఉత్తమ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా వారు హాజరుకాలేదు. బనకచర్ల రిజర్వాయర్ ప్రాకాశం జిల్లాలో పెన్నా బేసిన్ లో ఉంది. గోదావరి జలాలను పెన్నా బేసిన్ లోకి తరలించాలని ఏపీ భావిస్తోంది. పెన్నాలోకి గోదావరి జలాలు తరలించి రాయలసీమకు నీరు ఇచ్చే ప్రణాళికతో ఉంది. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్ లోకి తరలిస్తున్నారు. గోదావరి-బనకచర్లను అనుసంధానించి 200 టీఎంసీలు వాడుకునేందుకు ఏపీ ప్రణాళికలు చేస్తోంది. రోజుకు మూడు టీఎంసీలు తరలించే 7.41 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రణాళికతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణ యాజమాన్య బోర్డులతో పాటు ఈ బేసిన పరివాహక ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలకు పంపించింది. 15 రోజుల్లో మీ అభిప్రాయాలను చెప్పాలని కోరారని చెప్పారు. ఈ ప్రాజెక్టును అభ్యంతరం చెబుతూ ప్రాథమికంగా లిఖితపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు ప్రపోజల్ వల్ల విభజన చట్టం ఉల్లంఘించినట్లు అవుతున్నదన్నారు. ఈ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడమే తెలంగాణ ప్రయోజానాలు దెబ్బతీస్తుందన్నారు.
రోజుకు 3 టీఎంసీలు తరలించే ప్లాన్:
బనకచర్ల రిజర్వాయర్ ప్రాకాశం జిల్లాలో పెన్నా బేసిన్ లో ఉంది. గోదావరి జలాలను పెన్నా బేసిన్ లోకి తరలించాలని ఏపీ భావిస్తోంది. పెన్నాలోకి గోదావరి జలాలు తరలించి రాయలసీమకు నీరు ఇచ్చే ప్రణాళికతో ఉంది. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్ లోకి తరలిస్తున్నారు. గోదావరి-బనకచర్లను అనుసంధానించి 200 టీఎంసీలు వాడుకునేందుకు ఏపీ ప్రణాళికలు చేస్తోంది. రోజుకు మూడు టీఎంసీలు తరలించే 7.41 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రణాళికతో ఉన్నారు.






