- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ తీవ్ర అభ్యంతరం.. అయినా ఆగని ఏపీ సర్కార్
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ముందు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూనే ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ముందు నుంచీ రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూనే ఉన్నది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఎన్నో రకాల విజ్ఞాపణలు అందించారు. మరోవైపు.. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ.. ఏపీ ప్రభుత్వం తాజాగా డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఆమోదించవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మరోసారి అభ్యంతరం తెలుపుతూ కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)కు లేఖ రాయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం ఇటీవల ఏపీ జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బిడ్‌లో పాల్గొనేందుకు వీలుగా టెండర్లు దాఖలు చేయవచ్చని సూచించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. డీపీఆర్ టెండర్లను అడ్డుకోవాలని కోరుతూ నేడో రేపో లేఖ రాయనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేయనుంది.






