- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Budget: కాసేపట్లో ఏపీ వార్షిక బడ్జెట్.. అసెంబ్లీలో పయ్యావుల, మండలిలో ప్రవేశపెట్టనున్న అనిత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ఈనెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, పరోక్ష పద్ధతిలో కీలక పదవుల ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav ఇవాళ ఉదయం సరిగ్గా 11.15 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ.3.45 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు పెట్టనున్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం 12.50 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మరోవైపు శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ చదివి వినిపించనున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమై బడ్జెట్ ముసాయిదాకు అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు.






