MLC కవితకు మొబైల్ షాప్ ఉందా.. అన్ని ఫోన్‌లు ఎందుకు?

by Disha Web Desk 2 |
MLC కవితకు మొబైల్ షాప్ ఉందా.. అన్ని ఫోన్‌లు ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఈడీ అధికారులకు కవిత ఫోన్లు సమర్పించిన అంశంపై ఆయన స్పందిస్తూ.. విమర్శలు చేశారు. రెండేళ్లలో కవిత తొమ్మిది ఫోన్లు ఎందుకు వాడారు. ఆమెకు మొబైల్ షాపు ఉందా?, బహుషా మొబైల్ షాపు ఓనర్లు కూడా ఇన్ని మొబైల్స్ వాడి ఉందరు. క్రికెట్ బుకీలు, హవాలా, మనీలాండరింగ్ తరహా వ్యాపారాలు చేసే వాళ్లు మాత్రమే కవిత మాదిరి ఎక్కువ ఫోన్లు వాడుతుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్లు ఇస్తున్నారంటే ఆమె తప్పు ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరి ఆయనపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



Next Story