రేపు అల్పపీడనం.. జూలై 8 వరకు భారీ వర్షాలు !

by velandi.Saikiran |

అల్పపీడనం కారణంగా జూలై 8వ తేదీ వరకు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రేపు అల్పపీడనం.. జూలై 8 వరకు భారీ వర్షాలు !
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. అల్పపీడనం కారణంగా జూలై 8వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడునున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ఒడిశా - పశ్చిమ బెంగాల్ కు అనుకొని ఏర్పడి రాజస్థాన్ వైపు ప్రయాణించనున్నట్లు వెల్లడించింది. దీని ఎఫెక్ట్ తో జూలై 4వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఐదవ తేదీ నుంచి చాలా ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

మరోవైపు ఇవాళ కూడా ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో మోస్తారు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదిత ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మొత్తానికి రేప‌టి నుంచి 8వ తేదీ వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈదురు గాలుల‌తో పాటు వ‌ర్షాలు ప‌డ‌నున్న‌ట్లు అంచ‌నా వేసింది వాతావ‌ర‌ణ శాఖ‌.

Next Story