జాతీయ పార్టీలో.. ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావచ్చు! పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్

by Geesa Chandu |

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీని ఏఐసీసీ ప్రకటించిందని.. సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని పీసీసీ స్వాగతిస్తుందని, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ వెల్లడించారు.

జాతీయ పార్టీలో.. ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావచ్చు! పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీని ఏఐసీసీ ప్రకటించిందని.. సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని పీసీసీ స్వాగతిస్తుందని, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీలో ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావచ్చని, ఈ విషయం తెలియక కొందరు బీఆరెస్ నేతలు అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారని అన్నారు. సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన సింఘ్వీ రాజ్యసభలో ఉండటం ఎంతో అవసరమని అన్నారు. అయితే సింఘ్వీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను కొట్టినవారికి మంత్రి పదవులు ఇచ్చిందని మండిపడ్డారు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికలలో రెండు సార్లు ప్రజలు ఓడించినా కూడా బీఆరెస్ కు బుద్ధి రాలేదని అన్నారు. మహిళలను అవమాన పరిచేలా కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిరంజన్.

Next Story