‘రాజీవ్ యువ వికాసం’పై మరో అప్‌డేట్.. కలెక్టర్లకు సర్కార్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్​యువ వికాసం’ (Rajiv Yuva Vikasam) పథకానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

‘రాజీవ్ యువ వికాసం’పై మరో అప్‌డేట్.. కలెక్టర్లకు సర్కార్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Government) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్​యువ వికాసం’ (Rajiv Yuva Vikasam) పథకానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు అందినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పథకానికి సంబంధించి ప్రభుత్వం మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవలే ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని (SC Classification Law) రాజీవ్‌ యువ వికాసం పథకంలో అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు అందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక ఈ పథకానికి గాను ఎస్సీ సామజికవర్గం నుంచి మొత్తం 44,800 దరఖాస్తులు అందాయి. దీంతో తాజాగా ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం మూడు ఉపకులాలకు 1, 9, 5 శాతంతో రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. అయితే, ఎస్సీ గ్రూప్-B నుంచి అత్యధిక దరఖాస్తులు అందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే దరఖాస్తుల వారీగా లబ్ధిదారులకు కౌన్సిలింగ్ (Counseling) ప్రక్రియ నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. అనంతరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ యూనిట్‌ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం విదితమే.

Next Story