- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Assembly Sessions : జగదీష్ రెడ్డి అంశంలో మరో ట్విస్ట్
అసెంబ్లీ(Telangana Assembly)లో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెండ్(Jgadish Reddy Suspension) అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Telangana Assembly)లో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెండ్(Jgadish Reddy Suspension) అయిన సంగతి తెలిసిందే. కాగా జగదీష్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని చట్టసభల ఎథిక్స్ కమిటీ(Ethics Committee)కి పంపాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. కాగా రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద కార్యక్రమం మొదలైంది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సభ మీ ఒక్కరిదే కాదని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడిన కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.
ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం అయ్యాక.. జగదీష్ రెడ్డిని సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. సచివాలయం రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే జగదీష్ రెడ్డి స్పీకర్ ను అగౌరవపరిచేలా మాట్లాడిన అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సభ్యులు కోరినట్టు సమాచారం.






