మరో విద్యార్థిని ఆత్మహత్య..

by Taduka Kalyani |   (  Updated:2023-02-27 13:55:05  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ కు చెందిన మెడికో ప్రీతి, మరో అమ్మాయి రక్షిత ఆత్మహత్యలు సంచలనం రేకెత్తించగా, తాజాగా మరో విద్యార్థిని సైతం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

మరో విద్యార్థిని ఆత్మహత్య..
X

దిశ, భీమదేవరపల్లి/ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ కు చెందిన మెడికో ప్రీతి, మరో అమ్మాయి రక్షిత ఆత్మహత్యలు సంచలనం రేకెత్తించగా, తాజాగా మరో విద్యార్థిని సైతం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన ఉషారాణి(20), హుజురాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఒకేషనల్ కోర్సు చేస్తుంది.

కాగా భూపాల్ పల్లి జిల్లాకు చెందిన యువకుడు ప్రేమించి మోసం చేశాడని తీవ్ర మనస్థాపం చెందింది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Also Read...

ప్రముఖ యాంకర్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో యువకుడికి టోపీ.. ఏంతంటే..?

Next Story