పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్‌పోర్టు కల నిజమయ్యే దిశగా మరో అడుగు: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

by Ramesh Naini |   (  Updated:2025-10-11 16:50:27  IST  )

పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రెండు సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రామగుండం ఎయిర్‌పోర్ట్‌ కల ఇప్పుడు సాకారం అవుతోందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.

పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్‌పోర్టు కల నిజమయ్యే దిశగా మరో అడుగు: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రెండు సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రామగుండం ఎయిర్‌పోర్టు (Ramagundam Airport) కల ఇప్పుడు సాకారం అవుతోందని, ఎయిర్‌పోర్టు ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగబోతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ (MP Gaddam Vamsi Krishna) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా రూ.40.53 లక్షలు మంజూరు చేసి, (Airports Authority of India) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రీ-ఫిజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించిందని, ఇది రామగుండం ఎయిర్‌పోర్ట్‌ స్థాపన దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

దీని వలన హైదరాబాద్‌కి గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం లేకుండా ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుందని, ఇది మన ప్రాంతానికి నూతన ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను తెస్తుందని వంశీకృష్ణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ప్రీ-ఫిజిబిలిటీ స్టడీ పూర్తయిన తర్వాత, సెంటర్‌ ఫిజిబిలిటీ స్టడీ చేపడుతుందదన్నారు. రామగుండంలో ఎయిర్‌పోర్ట్‌ స్థాపన వరకు నా పోరాటం ఆగదని గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఈ ఆదేశాలు జారీ చేసిందని, పెద్దపల్లి జిల్లా అనంతరగాంవ్ మండలంలో 591 ఎకరాల భూమిపై గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై ఈ స్టడీ జరగనున్నట్లు వంశీకృష్ణ తెలిపారు.

Next Story