- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్
by Gantepaka Srikanth |
బీఆర్ఎస్(BRS) నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel)కు మరో షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel)కు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని షకీల్ గతంలో హైకోర్టు(TG High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత షకీల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
షకీల్ కుమారుడు సాహిల్ గతంలో కారును వేగంగా నడుపుతూ హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Next Story






