- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో సంచలనం.. తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ
రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నిత్యం హై సెక్యూరిటీ ఉండే తెలంగాణ రాజ్‌భవన్ (Telangana Rajbhavan)లో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు సుధర్మ భవన్ (Sudharma Bhavan)లో మొత్తం నాలుగు హార్డ్ డిస్క్ (Hard Disks)లు మాయమైనట్లుగా రాజ్‌భవన్ ఐటీ మెనేజర్ ఈనెల 15న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 14వ తేదీన మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి ఓ ఆగంతకుడు దూరి హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ (CCTV Footage) ద్వారా గుర్తించారు.
అయితే, రాజ్‌భవన్‌కు సంబంధించి మొత్తం వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఆ హార్డ్‌డిస్క్‌లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, 14వ తేదీ అర్ధరాత్రి హెల్మెట్ ధరించి కంప్యూటర్ గది (Computer Room)లోకి వెళ్లింది ఎవరు..? ఇది ఇంటి దొంగల పనేనా.. లేక బయటి వారు ఎవరైనా చేశారా..? అన్న దానిపై పంజాగుట్ట పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఈ మేరకు తాజాగా పంజాగుట్ట పోలీసులు రాజ్‌భవన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ హార్డ్‌డిస్క్‌లను చోరీ చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.






