Telangana: మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

by velandi.Saikiran |   (  Updated:2025-11-11 01:32:49  IST  )

తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం జరిగింది. తాజాగా మరో ట్రావెల్ బస్సు దగ్ధమైంది.

Telangana: మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
X

దిశ‌, వెబ్‌డెస్క్/చిట్యాల: తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం జరిగింది. తాజాగా మరో ట్రావెల్ బస్సు దగ్ధమైంది. విజయవాడ-హైదరాబాద్ రహదారి 65పై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ( NL 01 B 3250) అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ట్రావెల్ బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేల‌రేగాయి. దీంతో డ్రైవర్ వెంట‌నే అల‌ర్ట్ అయ్యాడు. ప్రయాణికులను స‌మాచారం ఇచ్చాడ‌ట‌.

ఈ తరుణంలోనే వెంటనే బస్సు అద్దాలు పగలగొట్టి, బయటకు దూకేశారు ప్రయాణికులు. అంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని చెబుతున్నారు ప్రయాణికులు. హైద‌రాబాద్ నుంచి నెల్లూరు వెళుతుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారట. అయితే ఈ ప్రమాదంలో జ‌రిగిన నేప‌థ్యంలో ప్రయాణికులంతా సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

అనంతరం చిట్యాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రెండు ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకోక ముందే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. జాతీయ రహదారిపై బస్సు అగ్ని ప్రమాదానికి గురవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలోనే కర్నూలులో వేమూరి కావేరి బస్సు దగ్ధమై, ఏకంగా 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

Next Story