- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srushti case : ‘సృష్టి’ కేసులో మరో వ్యక్తి అరెస్ట్.. 12 కి చేరిన నిందితుల సంఖ్య
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (IVF centers) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కృష్ణ అనే వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల సంఖ్య 12 చేరింది. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, శిశువుల క్రయ విక్రయాల్లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా హర్షరాయ్, సంజయ్, కృష్ణ లాంటి వారు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను విక్రయించే ఏజెంట్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అనైతిక సరోగసీ, మరోవైపు సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం విదితమే.






