- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Minister Rajanarsimha : జాబితాలో పేర్లు లేనివారికి దరఖాస్తులకు మరో అవకాశం : మంత్రి రాజనర్సింహ వెల్లడి

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం(Congress Indira Government) అర్హులైన ప్రతి పేద కుటుంబాని(Eevery Poor Family)కి ఇళ్లు, రేషన్ కార్డు(Houses, Ration Cards)లు దశల వారిగా అందిస్తుందని, జాబితాలో పేర్లులేని వారికి ఆందోళన అవసరం లేదని..వారికి మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని(Opportunity to Apply Again) రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ(Minister Damodaram Rajanarsimha) తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో జరుగుతున్న గ్రామ సభకు ఆయన హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహకు గ్రామ మహిళలు, వృద్ధులు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలను అక్కడికక్కడ పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయన్నారు. పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాలకు లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదన్నారు.
దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డు ఇస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12 వేలు అందజేస్తామన్నారు. పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోనివారికి, దరఖాస్తు చేసుకున్నా పేరు రానివారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులైన పేదలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి దరఖాస్తునూ మరోసారి పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందజేస్తామన్నారు.
ఈ ఊరికి మళ్లీ వచ్చి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను నేనే ప్రారంభిస్తానన్నారు. గతంలో రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, వారికి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు, కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదేనన్నారు.