- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఉద్యమానికి శ్రీకారం చుడతా.. మంద కృష్ణ మాదిగ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)
ఎస్సీ వర్గీకరణే ఏకైక లక్ష్యంగా ముప్పై ఏండ్ల క్రితం మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా సాకారమైందని, ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ ఉద్యమం మరో రూపం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణే ఏకైక లక్ష్యంగా ముప్పై ఏండ్ల క్రితం మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా సాకారమైందని, ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ ఉద్యమం మరో రూపం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. రాజకీయ ఉద్యమం ద్వారా సాధ్యంకానిది చట్టపరంగా సాధించానని, ఇక వర్గీకరణ పూర్తి ఫలాలు అందాలంటే క్రీమీలేయర్ విధానం తప్పదని స్పష్టం చేశారు. లేనట్లయితే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన కుటుంబాలు, కులాలే ఇకపైన కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తాయని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తి కార్యరూపం దాల్చాలంటే వర్గీకరణ తరహాలోనే క్రీమీలేయర్ కూడా ఉనికిలోకి రావాలన్నారు. ఇప్పటివరకూ జరిగిన ఉద్యమం ఒక ఎత్తయితే ఇకపైన చేయాల్సింది మరో సాహసమని ‘దిశ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.






