- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేఆర్ఎంబీపై ఏపీ మరో లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర జనవనరుల శాఖ డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర జనవనరుల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి అధికారులు లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ బోర్డును తక్షణమే అమరావతికి తరలించాలని కోరారు. కేఆర్ఎంబీని అమరావతిలో ఏర్పాటు చేస్తే కావాల్సిన వసతులు కల్పిస్తామని లేఖలో పేర్కొన్నారు. కాగా.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణగా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయినప్పటికీ గతంలో కేటాయించినట్లుగానే కృష్ణా నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.
దీంతో నిత్యం నీటి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఏ వివాదం, సమస్య వచ్చినా హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ బోర్డు పరిధిలో చర్చలు జరుపుతున్నారు. అయితే.. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కృష్ణా రివర్ బోర్డును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ మరోసారి కోరింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రంతోపాటు కేఆర్‌ఎంబీకి ఆ రాష్ట్ర జనవనరుల శాఖ అధికారులు లేఖలు రాశారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అవుతున్నా బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో తాజాగా మరోసారి లేఖ రాశారు.






