TG: కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. నేటి నుంచి పది రోజుల పాటు సంబరాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

TG: కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. నేటి నుంచి పది రోజుల పాటు సంబరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి పది రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakthi Scheme) సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్త సభ్యులను చేర్పించేలా అన్ని స్థాయిల్లో కళా జాతాలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా బ్యాంకు రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ చేయనున్నారు.

నేడు ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు. కాగా, మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గత ఏడాది ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేరళ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమలవుతున్న క్యాంటీన్లను అధ్యయనంచేసి, ఇక్కడా వాటి ఏర్పాటుకు సంకల్పించింది. తొలి దశలో జిల్లాకు ఐదు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తొలుత కామారెడ్డి కలెక్టరేట్‌లో 2024 మార్చి 27న ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా క్యాంటీన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

Next Story