రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ మరో కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ మరో కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల జారీపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని అన్నారు. ఆహార భద్రత చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని నొక్కి చెప్పారు. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్(BRS) కేవలం 40 వేల రేషన్‌కార్డులే ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్‌ కార్డులున్నాయని స్పష్టం చేశారు.

కాగా, జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుభరోసా విషయంలో కూడా కొందరు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని.. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు భట్టి చెప్పారు.

Next Story