మరో హెలికాప్టర్ కొనుగోలుకు టీఆర్ఎస్ సిద్ధం.. విరాళాలు ఇస్తున్న దాతలు

by Vinod kumar |   (  Updated:2022-10-01 01:52:50  IST  )

టీఆర్ఎస్ పార్టీ మరో హెలికాప్టర్ కొనుగోలుకు - Another helicopter for TRS party.. Donors coming forward to donate

మరో హెలికాప్టర్ కొనుగోలుకు టీఆర్ఎస్ సిద్ధం.. విరాళాలు ఇస్తున్న దాతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ మరో హెలికాప్టర్ కొనుగోలుకు చేయనుంది. ఇప్పటికే 12 సీట్ల సామర్థ్యంతో కొత్త విమానం కొనుగోలు చేశారు. అయితే ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు లోకల్ గా ఇబ్బంది ఉండకూడదనే భావనంతో 20 నుంచి 25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం పార్టీలోని కొంతమంది నేతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 10 మంది దాతల నుంచి 100 కోట్లు సేకరించి విమానం కొనుగోలుకు 82 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఇంకా అందులో 18 కోట్లు మిగిలి ఉండగా, హెలికాప్టర్ కొనుగోలుకు కూడా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నట్టు సమాచారం. ఈ వివరాల రూపంలో వచ్చిన దానిని కొనుగోలు చేయగా మిగిలినవి కేసీఆర్ జాతీయ పర్యటనలకు ఉపయోగించనున్నారు. ఏదీ ఏమైనప్పటికీ దసరా రోజే విమానం, హెలికాప్టర్ కు పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Also Read: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్‌.. పార్టీ నూతన అధ్యక్షుడు ఇతడే..?

Next Story