Kavach : తెలంగాణకు కేంద్రం మరో గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు ఒక శుభవార్తను తెలిపింది.

Kavach : తెలంగాణకు కేంద్రం మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు ఒక శుభవార్తను తెలిపింది. సికింద్రాబాద్‌(Secundrabad)లో రైల్వే భద్రత కోసం "కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"(Kavach Center of Excellence) అనే పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడానికి రూ.265 కోట్లు మంజూరు చేసింది. ఈ సెంటర్ ఇండియన్ రైల్వే(Indian Railways)లో రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు "కవచ్"(Kavach) అనే స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. కవచ్ అంటే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది రైళ్లు ఢీకొనకుండా, సిగ్నల్‌లను దాటకుండా, డ్రైవర్ పొరపాటు చేసినా ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసేలా చేస్తుంది. ఈ సెంటర్ ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్(IRISET)లో పని మొదలు పెట్టింది.

ఇది రైల్వే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, కవచ్ టెక్నాలజీని మరింత మెరుగుపరచడం, ప్రపంచ స్థాయి రైల్వే భద్రతా సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఈ సెంటర్‌లో కొత్త బ్రేకింగ్ సిస్టమ్‌లు, లోకో-టు-లోకో కమ్యూనికేషన్ వంటి టెక్నాలజీలను రూపొందిస్తారు. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీలతో కలిసి ఈ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు కూడా అందిస్తారు. ఈ సెంటర్ ద్వారా తెలంగాణ రైల్వే భద్రతలో దేశంలోనే ముందుంటుందని, ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story