Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మరో గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనది ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu). లబ్దిదారుల ఎంపికలు పూర్తయ్యి శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి.

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనది ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Indlu). లబ్దిదారుల ఎంపికలు పూర్తయ్యి శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అయితే పట్టణాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ ఫోకస్ చేసింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ పట్టణాల్లో పేదలు ఉన్నచోటే వారికి G+ ఇళ్ళు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని నాలుగు ITDA ప్రాంతాల్లోని చెంచు, కోలామ్, తోటి, కొందరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని తెలిపారు. మరో 16 షెడ్యూల్డ్ ట్రైబల్ నియోజక వర్గాలకు 8,750 ఇళ్ళు మంజూరు చేశామని అన్నారు. ఈ లబ్దిదారుల ఇళ్ళ నిర్మాణాలు తక్షణమే చేపట్టి.. శరవేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు.

Next Story