బ్రేకింగ్ న్యూస్ : సిటీలో మరో అగ్ని ప్రమాదం

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ న్యూస్ : సిటీలో మరో అగ్ని ప్రమాదం
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో ఓ కూరగాయల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో మంటలు రావడంతో కూరగాయల దుకాణం అగ్నికి ఆహుతి అయింది.

ఘటనా స్థలికి చేరుకుని అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఆస్తినష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? ఇంకేమైనా కారణలున్నాయా? అనే కోణంలో తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed