- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక తథ్యం..! రాజీనామా వైపే దానం మొగ్గు?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్నారు. తమ పార్టీపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కాగా, ఆ నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణలు ఇవ్వగా.. ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు వివరణలు ఇవ్వలేదని తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ గురువారం స్పీకర్ వీరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే తన నోటీసులకు అఫిడవిట్లు ఇవ్వాలని స్పీకర్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను నాలుగు వారాల్లో తేల్చాలని, నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పీకర్ ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల మౌఖిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. అయితే దానం విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌నుంచి కాంగ్రెస్అభ్యర్ధిగా పోటీ చేశారు. దీంతో ఆయన ఆ నోటీసులకు వివరణలు ఇస్తే ఆ తర్వాత జరిగే విచారణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ విచారణలో ప్రతికూల నిర్ణయం వెలువడితే రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందన్న భావనలో నాగేందర్ ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. కాగా, రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది. దీనితో పాటు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 24వేలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్‌కి సానుకూల వాతావరణం ఉందని, ఈ క్రమంలోనే రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్‌కి వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువు అవుతుందన్న ఆలోచనలో అటు దానం ఇటు కాంగ్రెస్ ముఖ్యనేతలు కూడా ఉన్నట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు.
ఢిల్లీ వెళ్లిన దానం.. ఏఐసీసీ పెద్దలతో భేటీ..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ విచారిస్తున్న సమయంలోనే దానం నాగేందర్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత పరిస్థితిపైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు దానం ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను రాజీనామ చేస్తానని, తప్పకుండా గెలుస్తానని వారికి దానం నాగేందర్ చెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడంతో తాను కూడా విజయం సాధిస్తానని, అయితే తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటుకల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్పెద్దలను దానం కోరినట్లుగా కూడా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనితో దానం ఎప్పడైనా తన రాజీనామాను ప్రకటించే అవకాశాలున్నట్లుగా ఆయన అనుచరులు చెప్తున్నారు.
గతంలో టీడీపీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరి.. బైపోల్ బరిలో..
దానం నాగేందర్ గతంలో కూడా కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం ఉండి 1994, 1999 ఆసిఫ్ నగర్నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన అప్పటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడం, దానం నాగేందర్ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆసిఫ్నగర్కి బై ఎలక్షన్స్ వచ్చాయి. కాగా, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో డిలిమిటేషన్‌లో ఏర్పడింది. అప్పటి నుంచి దానం ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో దానం గెలిచి మంత్రి అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కి రాజీనామా చేసి అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున పోటీచేసి గెలిచారు.






