TG: తెలంగాణలో మరో ఉప ఎన్నిక? జూబ్లీహిల్స్ తర్వాత మరో పొలిటికల్ దంగల్‍కు స్కెచ్!

by Prasad Jukanti |   (  Updated:2025-10-22 07:24:49  IST  )

తెలంగాణ ఎన్నికల్లో మరో ఉప ఎన్నిక రాబోతోందా?

TG: తెలంగాణలో మరో ఉప ఎన్నిక? జూబ్లీహిల్స్ తర్వాత మరో పొలిటికల్ దంగల్‍కు స్కెచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) చుట్టూ తిరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. దాఖలైన నామినేషన్లను ఇవాళ పరిశీలించనున్నారు. ఎల్లుండితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఆ తర్వాత ప్రధాన పార్టీలన్ని ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నాయి. ఈ ఉప ఎన్నిక చాలెంజ్‍గా మారిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సై అంటే సై అనేలా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోందా అనే చర్చ స్టేట్ పొలిటికల్ సర్కిల్‍లో జోరుగా వినిపిస్తోంది.

పక్కా వ్యూహాత్మకమేనా?:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ (Congress star campaigners list) ప్రకటించింది. అయితే ఈ లిస్ట్ లో పార్టీ మారిన దానం నాగేందర్ (Danam Nagender) పేరు సైతం ఉంది. దీంతో తమ పార్టీకి చెందిన దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గత జూలై 31న తెలంగాణ శాసనసభ స్పీకర్ కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 31వ తేదీలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ దానం పేరును తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడం అంటే బీఆర్ఎస్ చేతికి అస్త్రాలు ఇచ్చినట్లేనని, కోర్టుల్లోనూ అధికారికంగా దానంపై చర్యలు తీసుకునేలా ఆయుధాలు అందిచినట్లేననే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ సెంగ్మెంట్‍లో పట్టు ఉన్న దానం పేరును కాంగ్రెస్ జాబితాలో చేర్చడం వెనుక అధికార పార్టీ మాస్టర్ స్కెచ్ ఉందనే మాట వినిపిస్తోంది. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మరో ఉప ఎన్నికకు (Another by-election) సమాయత్తం అవుతోందని అదులో భాగంగానే వ్యూహాత్మకంగానే దానం విషయంలో ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

జూబ్లీహిల్స్ ఫలితం ఆధారంగా నిర్ణయం?:

అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదని వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. వీరి విషయంలో చర్యలు తప్పవనే టాక్ ఉంది. వీరిలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ బీ-ఫామ్ తో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు అనివార్యం అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక వెనకడుగు వేసినా లాభం భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో ఉప ఎన్నికకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో దానంను ప్రచారానికి దింపారని టాక్ వినిపిస్తోంది. ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్షాలు పదే పదే కార్నర్ చేస్తున్న క్రంలో జూబ్లీహిల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీలని డిఫెన్స్ లోకి నెట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి మారుతున్న తాజా పరిణామాలు రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు కారణం అవుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Read More: BRS: ఎర్రవల్లి ఫామ్ హౌజ్‍లో కేసీఆర్‍తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ

Next Story